చలిమిడి ఈజీగా ఎలా చేయాలో చూద్దామా ? (CHALIMIDI )
హలో మై డియర్ ఫ్రెండ్స్ సిస్టర్స్ అందరు నవ్వుకుంటున్నారు చలిమిడి కూడా మనకి తెలవదా అని అవునండి కొన్ని సార్లు ఇది చేయటానికి కూడా కంగారు పడుతున్నారు చాల మంది .మనం ఏ పూజ చేసిన చలిమిడి లేకుండ అస్సలు చేయం కదా ? మరి రేపు శుక్రవారం పూజకి మీరు అంటే అందినది ఎవరు పూజ చేసుకుంటున్నారో కొత్తకోడళ్లు నోములు అవి ఉంటాయి కదా అమెరికాలో వున్నా ఏ ఇతరదేశాల్లో వున్నా మనవాళ్లంతా ఈ పూజలు కాపులసరీగా చేస్తారు కదా ? ఇవి మానానమ్మకాలు సాంప్రదాయాలు మనం అవి పాటించి మన తర్వాత తరాంకి కూడా చెప్పాలి కదండీ .
చలిమిడి
చలిమిడి చేయటానికి కావాల్సినవి
బియ్యం 1 KG
బెల్లం (OR ) షుగర్ 1/2 KG
కొబ్బరికాయ చిన్నది 1
గసగసాలు 30 GMS CUP .
యాలకులు 6 TO 8
జీడీ పప్పు( CASHEW NUTS ) 30 GMS
నెయ్యి 200 ML

చలిమిడి చేయు విధానం :
రెండు రోజుల ముందు బియ్యం నానబెట్టుకోవాలి .ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి (ఏరోజుకారోజు అంటే ) DAILY బియ్యంలో నీరు మారుస్తూ ఉండాలి . 3 వ రోజు బియ్యం బెజ్జాల గిన్నెలో వేసి వడకొట్టి మిక్సీలో వేసి వచ్చిన పిండిని రెండు సార్లు జల్లించి పిండి ఆరిపోకుండా దగ్గరగా నొక్కి పెట్టుకోవాలి .అంటే పిండిని చాల TIGHTGA గాలిచొరబడకుండాఅన్నమాట .కొబ్బరిని చాల చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయించుకునినెతిలో వేయించి తీసుకుని తర్వాత గసగసాలు వేయించి జీడిపప్పుని వేయించి తీసుకోవాలి ఏవి కూడా మాడకూడదు .యాలకులు పొడి చేసి పెట్టుకోవాలి .
ఇప్పుడు పోయి మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకుని పంచదార వేసి 1/4 లీటర్ నీళ్ళు పోసి అటు ముదురు ఇతి లేత పాకం కాకుండా మధ్యస్థంగావుండేటట్లు అయినతరువాత కొబ్బరి ముక్కలు యాలకుల పొడి వేసి కిందకి దించివేసుకుని మీకు వీలుగా ఒక్కరే ఉంటే రెండుకాళ్ళమధ్య ఆ గిన్నె ఒక క్లోత్థో పట్టుకుని వేడిగా ఉంటుంది కదా ?ఇప్పుడు నెమ్మదిగా పిండిని దానిలో కొంచం కొంచం వేసుకుంటూ కోడిగా బారుగా వున్నా గరిటతో కలుపుకోవాలి .పిండి కొంచెం మిగిలిన పర్వాలేదు చలిమిడి మరీగట్టిగా చేసుకోమాకండి .ఇప్పుడు దీనిని మీరు ప్రసాదంగా దేముడి దగగ్ర పెట్టుకోండి .ఇది చేయటం వస్తే తరువాత మీరు అరిసెలు బూరెలు ఈజీగా చేసేస్తారు మరి రుచి చూసి నాకు చెప్తారు కదా /
రేపు శుక్రవారం చేసి తప్పక నాకు చెప్పండి మరి