bobbatlu 2

బొబ్బట్లు /ఏ పప్పు లేకుండా ఈజీ నేతి బొబ్బట్లు (Puran Poli )

హాయ్ ఫ్రెండ్స్  మరి శ్రావణ శుక్రవారం  పూజకి రెడీ అయ్యారా ?  ప్రసాదాలు ఏమి చేయాలి ఎలా చేయాలి  అని భయపడుతున్నారా ? ఎందుకండి భయం మన smartcookingtelugu వుంది కదా ?

సరే మరి అది ఎలాగో చూద్దామా ?

బొబ్బట్లు

                     అనగానే మనం అందరం సనగపప్పుతో చేస్తాము కదా ? కానీ నేను ఇక్కడ పప్పువాడకుండా మృదువైన రుచికరమైనవి చేశాను .ఇవి మీకు కూడా బాగా నచ్చుతాయి .అందుకని మీరు కూడ  ట్రై చేసి చూడండి .నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి .మరి అవి తాయారు చేయటం  చూద్దామా ?

మనం ముందుగా అందరు చేసినట్లుగా మైదాతో కాకుండా గోధుమ పిండితో చేద్దాం  ఆరోగ్యానికి మంచిది కాదు అంటున్నారుగా మరి.గోధుమపిండితో చేయటానికి మనం ఒక బౌల్ తీసుకుందాము . దానిలోకి 2 కప్స్ గోధుమ పిండి (or myda )తీసుకుని దానిలోకి చిటికెడు ఉప్పు 1/4 టీస్పూన్ పసుపు తీసుకుందాము .అంటే మానగోధుమపిండితో చేసేవి మంచి కలర్ లో కనపడటానికి .ఇది ఒక చిట్కా అన్నమాట .1 టేబుల్ స్పూన్ గీ కూడా వేసుకొని ముందుగా నేయి పిండి ఉప్పు ఆలా బాగా కలుపుకుంటే ఉండలు వుండవు అండి .ఇలా కాలింకా మాత్రమే వాటర్ కలుపుకోవాలి .ఇది రెండవ చిట్కా అండి .ఆలా కలుపుతూవుండకివచ్చాక మళ్ళీ  ఒక గరిట నేయి వేసుకుని  మళ్ళీ  మృదువుగా కలుపుకోవాలి .ఎంత మృదువుగావుంటే అంత బాగా బొబ్బట్లు వస్తాయి .కలిపినా పిండిని బాగా కవర్ చేసుకోవాలి .ఒక అరగంట ఆలా ఉండనిచ్చి తర్వాత చేసుకోవాలి .

బొబ్బట్లు  పూర్ణం

bobbatlubobbatlu 2

ఇప్పుడు బొబ్బట్లు పూర్ణం ప్రిపేర్ చేసుకుందాము.దానికోసం ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి 3 కప్స్  వాటర్ తీసుకుందాము.ఇక్కడ మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి ముఖ్యంగా .మనం ముందు గోధుమ పిండిని ఏ కప్ తో అయితే తీసుకున్నామో దానినే వాడాలి తేదరకుండా అప్పుడే పూర్ణం పిండి కొలతలు సరిగ్గా సరిపోతాయి .

3కప్స్ వాటర్ తీసుకున్న గిన్నెలోకి  తురిమిన బెల్లం 1 కప్ అయితే ఇక్కడ నేను రుచి కోసం పంచదార కూడా కలుపుతున్నాను అండి అది మీ ఇష్టం మొత్తం బెల్లం మొత్తం పంచదార లేదా అది సగం ఇది సగం ఆలా వేసుకోండి.అలాగే ఇక్కడ నేను కొంచెము కుంకుమపూవు కూడా వేస్తున్నా .ఇది కూడా ఒక చిట్కాని మనం చేసుకున్న పూర్ణాలు మంచి కలర్ రావటానికి .ఇలా పంచదార .ఇప్పుడు పంచదార బెల్లం కరిగిపోయి నీళ్లు బాగా బాగా వేడి అయ్యేవరకు వేడిచేయండి అంతే కానీ పాకం రానవసరంలేదు

ఇప్పుడు మనం పొయ్యిమీద ఒక పాన్ని పెట్టి కరిగిన నేయి 2 spoons  వేసి  దానిలో 1 కప్ బొంబాయిరవ్వ వేసి బాగా fry  చేయండి .అదేమిటి బొంబాయి రవ్వ అనుకోవద్దు ఇది కూడాబాగారుచిగానేవుంటుందండి .పైగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు .ఈరవ్వను  మీడియం flame  లో ఉంచుకుని  3 తో 4 నిముషాలు బాగావేయించి అది రంగుమారుతోంది అన్నప్పుడు ప్రక్కన  బెల్లం కరిగించిన నీళ్లు నాల్కలువుంటే వడగట్టి లేకపోతే అలాగే ముందుగా కొద్దిగా పోసి రవ్వ   కాస్త  దగ్గరగా వచ్చే దాక అప్పుడు మిగిలిన బెల్లం నీళ్లను మొత్తం పోసేయండి .రవ్వ ఈబెల్లమునెల్లను మొత్తం పీల్చుకుని మనకి చూడతగ్గ రవ్వమిశ్రమం తయారవుతుంది అదే కేసారిలాగన్నమాట అంటే సాఫ్టీగా  సిల్కీ గ అన్నమాట .దానిలో కొద్దిగా మనం సువాసనకు వేసుకునే యాలకులపొడి వేసుకుంటాం కదా అది వేయండి.కొద్దిగా ఒక గరిట నేయి వేసి పూర్ణం  ఆ పాన్ నుండి విడి పోయేలాగా అన్నమాట అంతే ఆ  రవ్వ గట్టిగ అయ్యేవారికి తిప్పవలసిన పని లేదు  ఎందుకంటే చల్లారితే అది మరీగట్టిగా అయిపోతుంది అందుకని గట్టిగ అవ్వకముందే స్టవ్ ఆఫ్ చేసి దానిని దించేయండి .

పూర్ణం పిండి చల్లారాక  చేతికి నెయ్యిరాసుకుని బల్లస్ లాగా చేసుకుందాం .ఆ బాల్స్ మీకు ఏ సైజు లో కావాలో ఆ సైజు అన్నమాట అవి ప్రక్కన పెట్టుకుని మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని  మళ్ళీ  ఒకసారి smoothga  అయ్యేలాగా కలుపుకుని  ఇక్కడ ఇంకొక ట్రిక్ చేసి పెట్టుకున్న పూర్ణం  వుండాలకన్నా  కొద్దిగా చిన్నవిగా చేసుకోవాలి .

బొబ్బట్లు వత్తుకునే  విధానం .

మీకు తెలుసా  puranpoli కోసం బట్టర్ పేపర్ ఉంటాయి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు లో దొరుకుతాయి . ఆలా కాకుండా మీరు బట్టర్ పేపెర్తీసుకుని మీకు కావాల్సిన సైజు  బట్టర్ paperni రౌండ్గా అదే అంది మరి మనం బొబ్బట్లు అలాగే చేస్తాము కదా . ముందుగా పిండిముద్దని పెట్టి అది 3 తో 4 ఇంచెస్ అయ్యేదాకా వట్టి దానిలో పూర్ణం ఉండ ని పెట్టి చుట్టుప్రక్కల చక్కగా కవర్ చేసి పూర్ణం బయిటికి రాకుండా వట్టి మళ్ళి దానిని తిరగ వేసి దానిని కొద్దిగా వత్తి  దాని మీద ఇంకొక రౌండ్ బట్టర్ పేపర్ వేసి చక్కగా  రౌండ్గా వచ్చేటట్లు చేసుకుందాము మనం అనుకున్న సైజు వచ్చేవరకు వట్టి ఇప్పుడు బట్టర్ పేపర్ తీసేసి ఇప్పుడు స్టవ్ మీద మనం కాల్చుకుని చపాతీ పెనం మీద దానిని వేసి చక్కగానేతి తో టచ్ చేస్తూ రెండువైపులా ముందుగా మీడియం ఫ్లేమ్ తర్వాత low  ఫ్లేమ్ లో రెండువైపులా నేతితో టచ్ అప్ ఇవ్వాలి అది ఆలా కాలాక  దానిని తీసి ప్లేట్ లో వేసుకుని ఆరాక మీరు తిని అందరికి అరుచి చూపించండి మరి మీరు వ్రతం చేసుకుంటుంటే మీరు రుచి చూడలేరుగా ఇతరులకి చూపించండి .మరి మన బొబ్బట్లు రెడీ

Padma Kantamneni

Pro Chef & Blogger

Padma Kantamneni, a seasoned chef and dedicated blogger, delights in sharing culinary expertise and flavorful creations

Padma Kantamneni

Sponser

This is the heading

You want To Boost Your Sales Online

Get Deal

Explore